‘ఎస్‌ఈసీ లేఖ రాసిన తీరు తీవ్ర ఆక్షేపణీయం’
close

తాజా వార్తలు

Updated : 28/01/2021 19:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎస్‌ఈసీ లేఖ రాసిన తీరు తీవ్ర ఆక్షేపణీయం’

సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌ను వెనక్కి పంపండి
డీవోపీటీకి ఏపీ సీఎస్‌ లేఖ

అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ జారీ చేసిన అభిశంసన ఉత్తర్వులు (సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌)ను వెనక్కి పంపాల్సిందిగా ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. ఇద్దరు ఉన్నతాధికారులపై ఎస్‌ఈసీ అవమానకర రీతిలో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. 

‘‘పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సవరించకపోవడాన్ని కారణంగా చూపిస్తూ ఎస్‌ఈసీ అభిశంసన ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల నుంచి వివరణ కోరకుండా వారిపై ఆ ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని అతిక్రమించడమే. ఇద్దరు ఉన్నతాధికారులకూ తప్పనిసరి ఉద్యోగ విరమణ చేసేలా చూడాలంటూ లేఖ రాయడం తీవ్ర ఆక్షేపణీయం. ఎస్‌ఈసీ అధికార పరిధిని మించి అభిశంసన ఉత్తర్వులు ఇవ్వడం సరికాదు. స్వల్ప స్థాయి ఉల్లంఘనల్ని సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాల్సిందిగా డీవోపీటీకి ఎస్‌ఈసీ లేఖ సూచించడం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటమే. ఈ ప్రొసీడింగ్స్‌ను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఎస్‌ఈసీ పంపిన సెన్సూర్‌ ప్రొసీడింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు. రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి చొరబడటం సరికాదన్న విషయాన్ని ఎస్‌ఈసీకి తెలియజేయాలని కోరుతున్నా’’ అని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. 

ఇవీ చదవండి..

హైకోర్టులో అశోక్‌గజపతిరాజుకు ఊరట

జిల్లాల పర్యటనకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని