close

తాజా వార్తలు

Published : 06/02/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: డీజీపీ

విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది పర్యటిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామాల్లో పెట్రోలింగ్‌ జరుగుతోంది. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తాం. రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్‌ ఇస్తాం. సామాజిక మాధ్యమాలపై కూడా దృష్టి పెట్టనున్నాం. మద్యం, నగదు అక్రమ రవాణాపై తనిఖీలు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశాం’ అని అన్నారు.

ఇవీ చదవండి..
మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ చర్యలు

ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతలు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని