Raghurama: ఏపీ ప్రభుత్వం లంచ్‌ మోష‌న్ పిటిష‌న్‌
close

తాజా వార్తలు

Updated : 17/05/2021 13:08 IST

Raghurama: ఏపీ ప్రభుత్వం లంచ్‌ మోష‌న్ పిటిష‌న్‌

అమ‌రావ‌తి: ఎంపీ ర‌ఘురామ కేసులో ఏపీ ప్ర‌భుత్వం హైకోర్టులో లంచ్‌మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఎంపీకి జీజీహెచ్‌తో పాటు రమేశ్ ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని జిల్లా కోర్టు ఆదేశించినా.. ఆ మేర‌కు అధికారులు చేయ‌లేదు. కేవ‌లం జీజీహెచ్‌లోనే వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జిల్లా కోర్టు ఆదేశాల మేర‌కు ర‌మేశ్ ఆస్ప‌త్రిలోనూ వైద్య ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం నిన్న రాత్రి స్ప‌ష్టం చేసింది. ఈ ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాదులు పిటిష‌న్ వేశారు. దీనిని హైకోర్టు ధ‌ర్మాస‌నం స్వీక‌రించింది. ఈ మ‌ధ్యాహ్నం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని