
తాజా వార్తలు
ఏపీ: ఆగస్టు 15న ఇళ్ల స్థలాల పంపిణీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 15న లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేస్తామని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇంటి స్థలం పట్టాను మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని బొత్స వెల్లడించారు. మొత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బొత్స తెలిపారు. వాస్తవానికి జులై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Tags :