అసైన్డ్ భూముల అంశంలో చంద్రబాబుకు ఊరట
close

తాజా వార్తలు

Published : 17/04/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అసైన్డ్ భూముల అంశంలో చంద్రబాబుకు ఊరట

అమరావతి: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటినీ మరో మూడు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.  అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో తనపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో విచారించిన ధర్మాసనం దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మరోసారి పిటిషన్‌పై విచారణ జరిగింది. మధ్యంతర ఉత్తర్వులను మరో మూడు వారాల పాటు పొడిగిస్తూ తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని