
తాజా వార్తలు
సలాం కుటుంబం కేసు విచారణ వాయిదా
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో పోలీసులే నిందితులుగా ఉన్నందున ఆ శాఖవారితోనే విచారణ చేయించటం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్ వాదించారు.
అలా చేయడం.. సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. సలాం కుటుంబం సెల్ఫీ వీడియోను పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసుల తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
