రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై విచారణ
close

తాజా వార్తలు

Published : 09/02/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేషన్‌ వాహనాల రంగుల మార్పుపై విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాలశాఖ వాహనాలకు వేసిన రంగులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రేషన్‌ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రంగుల మార్పు ఖర్చుతో కూడుకున్న పని అని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రేషన్‌ పంపిణీ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాహనాలపై జగన్‌ ఫొటోలు ఉన్నాయా? అని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. వాహనాల ఫొటోలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రేషన్‌ వాహనాలకు వేసిన రంగులు మార్చాలని, అప్పటి వరకు గ్రామాల్లోకి వాహనాలు వెళ్లకుండా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాలు  చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇవీ చదవండి..

అమరావతి భూములపై సుప్రీంలో విచారణ
కంటతడి పెట్టిన అచ్చెన్నాయుడు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని