
తాజా వార్తలు
వైకాపా రంగుల ఖర్చు రాబట్టాలని పిటిషన్
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీ భవనాలను వైకాపా రంగులు వేయడానికి, తొలగించడానికి అయిన రూ.4వేల కోట్లను రాబట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం, తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారి నుంచే సొమ్ము వసూలు చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణను వ్యక్తిగతంగా ప్రతివాదులుగా చేర్చారు. వారిని వ్యక్తిగత ప్రతివాదులుగా ఎందుకు చేర్చారని పిటిషనర్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు