రేషన్‌ వాహనాలపై పార్టీ గుర్తులు వద్దు:హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 31/01/2021 15:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేషన్‌ వాహనాలపై పార్టీ గుర్తులు వద్దు:హైకోర్టు

అమరావతి: ఇంటింటికీ రేషన్‌ అందించే వాహనాలపై రాజకీయ నేతల ఫోటోలు, పార్టీ గుర్తులు ఉండరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పంపిణీకి అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల నిబంధనలకు లోబడే రేషన్‌ వాహనాల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

కార్యక్రమ వివరాలతో 2 రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని తెలిపింది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అని ప్రభుత్వ కోర్టుకు వివరించిన నేపథ్యంలో.. ఎస్‌ఈసీ 5 రోజుల్లో నిర్ణయం తెలపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇవీ చదవండి..
త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది

ఆదేశించినా బదిలీ చేయరా?Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని