ఫాం-10 ఇస్తే విచారణ జరపొద్దు: ఏపీ హైకోర్టు
close

తాజా వార్తలు

Updated : 19/02/2021 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫాం-10 ఇస్తే విచారణ జరపొద్దు: ఏపీ హైకోర్టు

మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం

అమరావతి: గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో మళ్లీ ఎస్‌ఈసీ విచారణ జరపకూడదని.. ఇవ్వనిచోట ఫలితాలు వెల్లడించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదంటూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇవి ఈనెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. 

రేషన్‌ పంపిణీ వాహనాలపై డివిజన్‌ బెంచ్‌కు ఎస్‌ఈసీ

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్‌ పంపిణీ వాహనాలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. అప్పీల్‌పై డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరిగింది. గ్రామాల్లో రేషన్‌ పంపిణీని నిలువరించలేదని.. వాహనాలపై తటస్థ రంగులు వేయాలని సూచించామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. గతంలో రేషన్‌ పంపిణీ వాహనాలను గ్రామాల్లోకి అనుమతించాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. రేషన్‌ పంపిణీ చేసుకునేందుకు అనుమతించింది. దీనిపై తాజాగా డివిజన్‌ బెంచ్‌కు ఎస్‌ఈసీ అప్పీల్‌కు వెళ్లింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని