
తాజా వార్తలు
ఎన్నికల రద్దు పిటిషన్‌పై రేపు విచారణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. అంతకుముందే పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. న్యాయవాది శివప్రసాద్ రెడ్డి కోర్టులో ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఓటరు జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహిస్తే యువత ఓటు హక్కు కోల్పోతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఆ సమయంలో ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయవాది వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మంగళవారానికి విచారణ వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం ఇవాళ మరోసారి వాయిదా వేసింది. ఎల్లుండి విచారణ జరుపుతామని పేర్కొంది. ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో పిటిషన్‌పై రేపు విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.
ఇవీ చదవండి..
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్ఈసీ
ద్వివేది, గిరిజా శంకర్ల అభిశంసన