అప్పటి వరకు ‘ఈ-వాచ్‌’ తేవొద్దు: హైకోర్టు
close

తాజా వార్తలు

Published : 05/02/2021 15:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటి వరకు ‘ఈ-వాచ్‌’ తేవొద్దు: హైకోర్టు

అమరావతి: ఏపీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీసుకొచ్చిన ‘ఈ-వాచ్‌’ యాప్‌ను ఈనెల 9 వరకు వాడకంలోకి తేవొద్దని హైకోర్టు ఆదేశించింది. ‘ఈ-వాచ్‌’ యాప్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది. యాప్‌కు సంబంధించి భద్రతా ధ్రువపత్రం అందలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ధ్రువపత్రం వచ్చేందుకు మరో ఐదు రోజులు పడుతుందని తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు యాప్‌ను అందుబాటులోకి తేవొద్దని స్పష్టం చేసింది. 

ఈనెల 3న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‘ఈ-వాచ్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. సాంకేతిక సమస్యలతో యాప్‌ వెలుగు చూడలేదు. ‘సెక్యూరిటీ ఆడిట్‌’ సంబంధిత అంశాలపై మరింత పరిశీలన అవసరమన్న ఉద్దేశంతో తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తొలుత ‘గూగుల్‌ ప్లే స్టోర్‌’లో గురువారం నుంచి యాప్‌ని డౌన్‌లోడు చేసుకోవచ్చని ప్రకటించినా సాంకేతికపరమైన అంశాలు అవరోధంగా నిలిచాయని అధికారులు తెలిపారు. ‘సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌’ తప్పనిసరి కావడంతో ఆంధ్రప్రదేశ్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (ఏపీటీఎస్‌)కి యాప్‌ పరిశీలన బాధ్యత అప్పగించినట్లు సమాచారం. 

ఇవీ చదవండి..

రాజీనామాలకు సిద్ధం కావాలి: గంటా

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం స్పందన


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని