ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు తొలగిన అడ్డంకి
close

తాజా వార్తలు

Updated : 26/02/2021 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు తొలగిన అడ్డంకి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఎన్నికల నిర్వహణకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ ఇచ్చి 11 నెలలు గడచినందున తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో నామనేషన్లు వేయనీయకుండా అధికారపార్టీ నేతలు అడ్డుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. పాత నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. యథావిధిగా మార్చి 10న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని ఆదేశాలు జారీ చేసింది.
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని