అమరావతి వ్యాజ్యాలపై రోజువారీ విచారణ
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమరావతి వ్యాజ్యాలపై రోజువారీ విచారణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాలపై మే 3వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. రాజధాని వ్యాజ్యాలపై ఏ విధంగా విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపింది. అనంతరం మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మొదటి నుంచి వాదనలు కొనసాగనున్నాయని ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని