ఆ ఆవేదనతోనే అలా మాట్లాడా: శ్రీరంగనాథరాజు
close

తాజా వార్తలు

Updated : 29/03/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఆవేదనతోనే అలా మాట్లాడా: శ్రీరంగనాథరాజు

తిరుపతి: పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో శనివారం తాను చేసిన వ్యాఖ్యలపట్ల రైతులు ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలని ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు కోరారు. తిరుపతి పర్యటనలో భాగంగా ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) రజతోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ‘వరి సోమరిపోతు వ్యవసాయం.. కష్టపడక్కర్లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలో మంత్రి వివరణ ఇస్తూ రైతు సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను భూ యజమానులే అనుభవిస్తున్నారని.. అవి కౌలు రైతులకు అందడం లేదన్నారు. ఆ ఆవేదనతోనే అలా మాట్లాడాను తప్ప రైతులను కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని