
తాజా వార్తలు
నగదు రవాణాపై మరింత నిఘా: నిమ్మగడ్డ
అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. నగదు రవాణాపై మరింత నిఘా ఉంచుతున్నామని, చెక్పోస్టుల్లో పటిష్టమైన తనిఖీలు జరుపుతున్నామని వెల్లడించారు. ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు నిశితంగా పరిశీలిస్తాయని ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు.
ఇవీ చదవండి
Tags :