సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా: నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Published : 14/02/2021 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా: నిమ్మగడ్డ

అమరావతి : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంతో స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని ఇనుమడింపజేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు సగ భాగం పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేశారని ప్రశంసించారు. సాధారణ ఎన్నికల తరహాలో అధికారులు చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఎస్‌ఈసీ అభినందించారు. మూడో విడత ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై గట్టి నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలంతా రానున్న విడతల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. 

 

ఇవీ చదవండి.
మంత్రి కొడాలి స్వగ్రామంలో తెదేపా మద్దతుదారు విజయం

ఓటెత్తిన పల్లె


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని