మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ చర్యలు
close

తాజా వార్తలు

Updated : 06/02/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ చర్యలు

అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. పెద్దిరెడ్డి వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని  భావించిన ఎస్‌ఈసీ.. ఆయన్ను ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని ఆదేశించింది. మీడియాతో కూడా మాట్లాడనివ్వొద్దని  సూచించింది. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిపేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకే ఈ చర్యలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్‌ఈసీపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. దీనిపై ఇటీవలే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌... గవర్నర్‌కు లేఖ రాశారు. లక్ష్మణరేఖ దాటొద్దంటూ మీడియా ముఖంగా నిమ్మగడ్డ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కూడా పెద్దిరెడ్డి వెనక్కి తగ్గలేదు. శుక్రవారం సాయంత్రం కూడా మీడియా సమావేశంలో ఎస్‌ఈసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏకంగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులనే హెచ్చరించారు.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే...
 ‘‘తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాట విన్నా... మేము అధికారంలో ఉన్నన్ని రోజులూ మిమ్మల్ని బ్లాక్‌లిస్టులో పెడతాం’’ అని జిల్లా కలెక్టర్లతో పాటు పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘మీ అందరికీ మీడియా ముఖంగా చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి. ఏ అధికారి అయినా ఎస్‌ఈసీ మాటలు వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అని అనుకుంటే గుణపాఠం తప్పదు. అందరినీ గుర్తు పెట్టుకుంటాం. చిత్తూరు, గుంటూరులో ఏకగ్రీవాలను ఆపమని ఆయన(నిమ్మగడ్డ) అంటున్నారు. మీరు ఆయన మాట వినకుండా ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ డిక్లరేషన్లు అందజేయాలని సూచిస్తున్నా. ఇవ్వకపోతే... పేరు పేరునా గుర్తు పెట్టుకొని ఎన్నికల తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఏ అధికారి కూడా నిమ్మగడ్డను గౌరవించి పని చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ‘నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మార్చి 31 వరకే ఎస్‌ఈసీగా ఉంటారు. అంతవరకూ మేము ఏమీ మాట్లాడదలచుకోలేదు.  రాష్ట్రంలో అత్యధికంగా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో వైకాపా అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది. ప్రజలందరూ ఏవైపు ఉన్నారని గుర్తించకుండా ఏకగ్రీవాలను ఆపాలనే అధికారం నీకెక్కడిది’ అని ఎస్‌ఈసీని ప్రశ్నించారు.

 

ఇవీ చదవండి...

మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి:తెదేపా

ఏపీలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభంTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని