అలాంటి ఫిర్యాదులు స్వీకరించండి: ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Published : 16/02/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలాంటి ఫిర్యాదులు స్వీకరించండి: ఎస్‌ఈసీ

అమరావతి: మున్సిపల్‌ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) స్పష్టత ఇచ్చింది. ఈ తరహా ఫిర్యాదులు స్వీకరించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల(ఆర్వో)కు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల ఉపసంహరణ కోసం నిర్దేశించిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దీనిపై వివరాలు పంపాలని సూచించింది. అసహజ రీతిలో నామినేషన్ల ఉపసంహరణ జరిగి ఉంటే అలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని ఎస్‌ఈసీకి నివేదించాలని ఆర్వోలను ఆదేశించింది. ఎక్కడైనా బలవంతపు ఉపసంహరణలు జరిగితే వాటిని పునఃపరిశీలించి పునరుద్ధరిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని