బాధిత కుటుంబానికి ఎస్‌ఈసీ పరామర్శ
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాధిత కుటుంబానికి ఎస్‌ఈసీ పరామర్శ

జగ్గంపేట: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తూర్పు గోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచ్‌ అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్‌ కుటుంబాన్ని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై తూ.గో.జిల్లా పర్యటనలో ఉన్న ఎస్‌ఈసీ గొల్లలగుంటలోని శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సత్వర, నిష్పాక్షిక విచారణతోనే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. రాజకీయాలు, తప్పులు ఎంచే సమయం ఇది కాదని ఎస్‌ఈసీ వివరించారు. విషయాన్ని రాజకీయం చేయకూడదని, మానవతా దృక్పథంతో చూడాలన్నారు.  

నిన్న అనుమానాస్పద స్థితిలో గొల్లలగుంట సర్పంచ్‌ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌రెడ్డి మృతిచెందారు. ఆదివారం అర్ధరాత్రి అపహరణకు గురైన శ్రీనివాస్‌రెడ్డి నిన్న సాయంత్రం పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ వార్తను తాను ఓ వార్త పత్రికలో చదివానని.. ఘటనకు గల కారణాలు, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలిస్తానని విశాఖ పర్యటనలో ఉన్న ఎస్‌ఈసీ ఇవాళ ఉదయం తెలిపారు. అభ్యర్థి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు.. కాదని కుటుంబ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో గొల్లలగుంటలో పర్యటించి అనంతరం జిల్లా అధికారులతో ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఎస్‌ఈసీ చెప్పారు. 

ఇవీ చదవండి..
రాజ్యాంగం చెప్పిందే ఈసీ చెబుతోంది : ఎస్‌ఈసీ

పట్టపగలు దాడి..వైకాపా గూండారాజ్‌కు సాక్ష్యం Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని