close

తాజా వార్తలు

Updated : 03/03/2021 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నామినేషన్ల ఉప సంహరణపై ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

అమరావతి:  మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. మరి కొద్ది గంటల్లో ఈ ప్రక్రియ ముగియనుండగా ... ఉప సంహరణలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 

 ఉపసంహరణ నోటీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ యాంత్రికంగా అనుమతించవద్దని స్పష్టం చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మూడో పక్షం నుంచి నామినేషన్ల ఉపసంహరణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని పేర్కొన్నారు. అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవటానికి సంబంధించిన కార్యకలాపాలను రిటర్నింగ్‌ అధికారులు  లేదా ఎన్నికల అధికారులు వీడియోగ్రాఫ్‌ చేయాలని ఆదేశించారు. అలాంటి ఫుటేజీలను ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని ఆదేశించారు. ఉప సంహరణలపై పలు రాజకీయపార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకోవడంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, అభ్యర్థిత్వాలను బలవంతంగా ఉపసంహరింపజేస్తున్నారని భయం వ్యక్తం  చేస్తూ పలు వర్గాలు ఫిర్యాదు చేశాయని వెల్లడించారు. ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్నికల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లును ఎస్‌ఈసీ ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్‌వోలు చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్‌ సెలవుపై వెళ్లడంతో సహాయ కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని