
తాజా వార్తలు
కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ కీలక ఆదేశాలు
అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వాన్ని సహించబోమని స్పష్టం చేశారు. పత్రాల జారీలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు, ఎస్ఈలతో గతం మరిచి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిద్దామని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వీడియోలు, ఫొటోలు యాప్ ద్వారా అప్లోడ్ చేయొచ్చన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించవద్దని.. ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే వారిపై చర్యలు తప్పవన్నారు. ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఏకగ్రీవాల్లో అక్రమాలు నిర్ధారణ అయితే ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి..
నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు
అనేక అవమానాలు ఎదుర్కొంటున్నా: ఆనం