ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌పై చర్యలు: నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Updated : 30/01/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌పై చర్యలు: నిమ్మగడ్డ

ప్రకటన ఇచ్చే ముందు విధిగా సంప్రదించాలి

ఎన్నిలకు సంబంధించి ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే..

కర్నూలు: పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో నిఘా పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. కర్నూలులో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ భిన్నాభిప్రాయాలతో బాగుపడుతుందని చెప్పారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావాలన్నారు. అలాంటప్పుడే మంచి నాయకత్వం, సామాజిక దృక్పథం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. బలవంతపు ఏకగ్రీవాలపై విధిగా షాడో బృందాలు ఏర్పాటు.. అవసరమైతే గృహనిర్బంధాలు చేయాలని జిల్లా అధికారులకు సూచించినట్లు ఎస్‌ఈసీ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార వ్యవస్థలన్నీ విజయవంతంగా పనిచేయబోతున్నాయని చెప్పారు. 

ఏకగ్రీవాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ను వివరణ ఎస్‌ఈసీ కోరినట్లు చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నిమ్మగడ్డ ప్రకటించారు. ఏకగ్రీవాల బూచితో బలవంతపు ఎన్నికలు జరుపుతారేమో అనే ఆందోళనతో వివిధ పార్టీలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయని.. ప్రలోభపెట్టి, భయపెట్టి ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఎన్నికల్లో జోక్యం చేసుకుని భయభ్రాంతులకు గురిచేయొద్దని నేతలకు సూచించారు. ఎన్నికలకు సంబంధించిన ఏ అంశమైనా ఎస్‌ఈసీ పరిధిలోనే ఉంటుందని.. ప్రకటనలు ఇచ్చే ముందు విధిగా సంప్రదించాలన్నారు. ఏకగ్రీవాలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై ఫిర్యాదులకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని.. చక్కని వాతావరణంలో ఎన్నికలను జయప్రదం చేయాలని ప్రజల్ని ఆయన కోరారు. 

ఇవీ చదవండి..

ఏకగ్రీవ ఒత్తిళ్లపై ‘షాడో’ నిఘా: నిమ్మగడ్డ

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జలTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని