నా పరిధి,బాధ్యత తెలుసు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Updated : 01/02/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పరిధి,బాధ్యత తెలుసు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

శ్రీకాకుళం: 40 ఏళ్ల తన సర్వీసులో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదని ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. తన పరిధి, బాధ్యత తెలుసని.. స్వీయ నియంత్రణ పాటిస్తానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి వ్యవస్థకూ రాజ్యాంగం నిర్దిష్టమైన విధులు కేటాయించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఓ వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబాటు కుదరదని చెప్పారు. 

‘‘బాధ్యతలు నిర్వర్తించేందుకే అధికారాలు ఇచ్చారు. మా విధుల్లో జోక్యం చేసుకున్నందునే కోర్టుకెళ్లాం. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది. ఏకగ్రీవాలకు మేం పూర్తిగా వ్యతిరేకం కాదు. దానిపై మాకు నిర్దిష్టమైన అభిప్రాయముంది. శ్రీకాకుళం జిల్లాలో గతంలో 20 శాతం ఏకగ్రీవాలు జరిగాయి. బలవంతపు ఏకగ్రీవాలు చేస్తేనే సమస్యలొస్తాయి. ఎన్నికలు పారదర్శకంగా జరగాలనే జిల్లాల్లో పర్యటిస్తున్నా. ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదుల స్వీకరణకే నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. బుధవారం యాప్‌ ఆవిష్కరించి దాని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా మాపై కేసు పెట్టారు. మా సామగ్రి తీసుకెళ్లి సిబ్బందిని భయపెట్టారు. బెదిరింపులకు భయపడితే వ్యవస్థ పలుచన అవుతుంది. మీ సంగతేంటో చూస్తామంటూ వ్యవహరించడం సరికాదు’’ అని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ హితవు పలికారు.

ఇవీ చదవండి..

ఎన్నికల తర్వాతే సిబ్బందికి వ్యాక్సిన్‌: డీజీపీ

ఏపీ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని