చివరి నిమిషం వరకు ప్రయత్నించారు: నిమ్మగడ్డ
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 17:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చివరి నిమిషం వరకు ప్రయత్నించారు: నిమ్మగడ్డ

ఒంగోలు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని ఏపీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్నారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఒంగోలులో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాట్ల పట్ల ఎస్ఈసీ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిమ్మగడ్డ మాట్లాడారు. జిల్లాలో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గాయని.. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న చర్యలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్‌ నడుచుకుంటుందని ఎస్‌ఈసీ చెప్పారు. గ్రామాల్లో రాజకీయ చైతన్యం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా అందరూ కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. ఎన్నికలు ఆపేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు నిధులు వస్తాయని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వివరించారు.

ఇవీ చదవండి..

ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పందన

రుణయాప్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలి: హైకోర్టు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని