ఓటు హక్కుతో పంచాయతీలకు జవసత్వాలు:ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Published : 07/02/2021 12:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటు హక్కుతో పంచాయతీలకు జవసత్వాలు:ఎస్‌ఈసీ

విజయవాడ: ప్రజలంతా పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏపీ ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఓటు వేసి పాలక వర్గాలను ఎన్నుకున్నప్పుడే పంచాయతీలకు జవసత్వాలు వస్తాయన్నారు. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఈసీ వీడియో సందేశం విడుదల చేశారు.
‘రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు నాలుగు విడతలుగా.. ఈనెల 9, 13, 17, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయి. వ్యవస్థలు మెరుగైన పనితీరును, జవాబుదారీతనాన్ని కనబరుస్తాయి. అందరూ విధిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించమని సవినయంగా రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున కోరుతున్నాను’ అని నిమ్మగడ్డ అన్నారు. 

ఇవీ చదవండి..

ఎస్‌ఈసీ ఆదేశాలను రద్దు చేసిన హైకోర్టు

తెలుగు గుండె తల్లడిల్లుతోంది: మండలి
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని