14 చోట్ల నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం
close

తాజా వార్తలు

Updated : 01/03/2021 20:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

14 చోట్ల నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం

అమరావతి: గత మార్చిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై వివిధ పార్టీల ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. చిత్తూరు, కడప జిల్లాల్లోని మొత్తం 14 చోట్ల కొత్తగా నామినేషన్లు వేసేందుకు ఆశావహులకు అవకాశం కల్పించింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు పలుచోట్ల తిరిగి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుమతించారు. 

చిత్తూరు జిల్లా తిరుపతిలో 6, పుంగనూరు 3, కడప జిల్లా రాయచోటిలో 2, ఎర్రగుంట్ల 3 వార్డుల్లో అవకాశం కల్పించారు. తిరుపతి కార్పొరేషన్‌లోని 2, 8, 10, 21, 41, 45 వార్డులకు.. పుంగనూరులోని 9, 14, 28 వార్డులు, రాయచోటిలోని 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డుల్లో నామినేషన్ల దాఖలుకు ఎస్‌ఈసీ అనుమతించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లను పరిశీలించనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువుగా రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని