
తాజా వార్తలు
ఫిర్యాదులపై స్పందించిన ఎస్ఈసీ
అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఆరోపణలు, ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. పోలీసులకు చేసిన ఫిర్యాదులను ఆర్వోలు పరిశీలించాలని ఆదేశించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ‘ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు నిర్దిష్ట సూచనలు, ఆదేశిలాచ్చాం. ఫిర్యాదులకు సంబంధించి ప్రతి సంఘటనపై కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. తిరుపతి 7వ డివిజన్లో బలవంతపు ఉపసంహరణ ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటాం. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం కమిషన్ దృష్టికి తీసుకురావాలి’’ అని ఎస్ఈసీ వెల్లడించారు.
Tags :