మూడో విడత ఎన్నికలపై ఎస్‌ఈసీ సంతృప్తి
close

తాజా వార్తలు

Published : 18/02/2021 10:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మూడో విడత ఎన్నికలపై ఎస్‌ఈసీ సంతృప్తి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన మూడో విడత పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఓటర్లు ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మూడో విడత ఎన్నికల్లో పలు సమస్యాత్మక గ్రామాలున్నప్పటికీ అంతా సహకరించారని కొనియాడారు.

 ఏజెన్సీలో సుమారు 350 పోలింగ్‌ కేంద్రాల్లో బహిష్కరణ పిలుపును సైతం తిరస్కరించి గిరిజన ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కితాబిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయురాలు దైవ కృపావతి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు.  కృపావతి కుటుంబ సభ్యులకు ఎన్నికల కమిషన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోందన్నారు. విజయనగరం జిల్లా చౌడవరంలో జరిగిన హింసాత్మక ఘటనను అక్కడ విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ కిషోర్‌ కుమార్‌ సమర్దంగా నియంత్రించారని.. ఇంది ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు. చివరి విడత ఎన్నికల్లోనూ పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని