‘ఈ-వాచ్‌’ యాప్‌ ఆవిష్కరించిన ఎస్‌ఈసీ
close

తాజా వార్తలు

Updated : 03/02/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఈ-వాచ్‌’ యాప్‌ ఆవిష్కరించిన ఎస్‌ఈసీ

విజయవాడ: ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్‌ఈసీ కొత్తగా రూపొందించిన ‘ఈ-వాచ్‌’ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో బుధవారం ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆవిష్కరించారు. పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మాట్లాడుతూ ‘ఎన్నికల్లో చోటుచేసుకునే అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా ఫిర్యాదుకు అవకాశం కల్పించాం. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా గోప్యంగా ఉంచుతాం. ఫిర్యాదులను పరిష్కరించినట్లు మళ్లీ తెలియజేస్తాం. రేపటి నుంచి ప్లేస్టోర్‌లో యాప్‌ అందుబాటులో ఉంటుంది. యాప్‌ కచ్చితంగా విజయవంతమవుతుంది. పారదర్శకతతో పాటు ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే యాప్‌ రూపొందించాం. పండుగలకు వచ్చినట్లు సొంత గ్రామాలకు వచ్చి ఓట్లెయ్యాలి’ అని అన్నారు. 

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా యాప్‌ తీసుకొస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార నిమిత్తం ఏర్పాటు చేస్తున్న కాల్‌ సెంటర్‌ని సైతం ఎస్‌ఈసీ ప్రారంభించారు. 

ఇవీ చదవండి..
రేషన్‌ వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ

తప్పు చేస్తే.. పెద్దోళ్లయినా శిక్ష తప్పదు
 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని