కరోనాతో ఏపీ సచివాలయం ఉద్యోగి మృతి
close

తాజా వార్తలు

Published : 17/04/2021 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో ఏపీ సచివాలయం ఉద్యోగి మృతి

అమరావతి: ఏపీ సచివాలయంలో ఓ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు. ఆర్థిక శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పని చేసే వి. పద్మారావు కొవిడ్‌ సోకి కన్నుమూశారు. దీంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కారణంగా మరోసారి ‘వర్క్‌ ఫ్రం హోం’ ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాలయంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్‌ భయంతో ఉన్నతాధికారులు విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని