
తాజా వార్తలు
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేసిన హైకోర్టు
అమరావతి: కిలారి రాజేష్, మరికొందరిపై నమోదైన కేసులను ఏపీ హైకోర్టు కొట్టేసింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ పోలీసులు కేసులు నమోదు చేయగా... వాటిని కొట్టివేయాలంటూ కిలారి రాజేష్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసులను కొట్టివేసింది. భూములు అమ్మిన వారెవరూ ఫిర్యాదులు చేయలేదని, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై ఐపీసీ సెక్షన్లు వర్తించవని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ అనంతరం కిలారి రాజేష్ మరి కొందరిపై కేసులను ధర్మాసనం కొట్టివేసింది.
ఇవీ చదవండి...
మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
Tags :