కరెంట్‌ పోయిందా.. ఉందో యాప్‌ 
close

తాజా వార్తలు

Published : 21/04/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరెంట్‌ పోయిందా.. ఉందో యాప్‌ 

హైదరాబాద్‌: విద్యుత్తు అంతరాయాలపై ఫిర్యాదు చేసేందుకు ఎర్రగడ్డలోని స్కాడా కార్యాలయంలో 24 గంటలూ పనిచేసే ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. నగరంలో వారం రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో కరెంట్‌ సరఫరా నిలిచిపోతోంది. ఫిర్యాదు చేసేందుకు 1912 నంబరుకు డయల్‌ చేస్తే లైన్‌ దొరకలేదని వినియోగదారులు వాపోయారు.  కాల్‌సెంటర్‌ సామర్థ్యం 30 సీట్లు మాత్రమే. వీరు ఏకకాలంలో 60 కాల్స్‌కు మించి సమాధానం చెప్పలేరు. ఒక్కోసారి మూడువేల కాల్స్‌ వస్తున్నాయి. మరోవైపు కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదుల సమాచారాన్ని స్థానిక సిబ్బందికి చేరవేయడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే యాప్‌ అప్‌డేట్‌ చేశామని.. కొత్త సేవల్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. 
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థకు ‘టీఎస్‌ఎస్పీడీసీఎల్‌’ పేరుతో యాప్‌ ఉంది. విద్యుత్తు అంతరాయాలపై 1912 కలవకపోతే యాప్‌ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. వాస్తవానికి యాప్‌లో ఫిర్యాదు చాలా సులువు. యూనిక్‌ సర్వీస్‌ నంబరు, మొబైల్‌ నంబరు ముందే రిజిస్టరై ఉంటాయి.సెకన్లలోనే ఫిర్యాదును రిజిస్టర్‌ చేయవచ్చు. యాప్‌లో ‘కన్జూమర్‌ సర్వీసెస్‌’ నొక్కగానే ‘నో పవర్‌ కంప్లైంట్‌’ అని ఉంటుంది. దానిపై నొక్కగానే ‘యూనిక్‌ సర్వీస్‌ నెంబరు’, పేరు కన్పిస్తుంది. సబ్మిట్‌ నొక్కితే.. ఫిర్యాదు నమోదవుతుంది. స్థానిక సిబ్బందికి సమాచారం వెళ్లగానే వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. మీ ఇంట్లో కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ అంతరాయాలుంటే ‘గెస్ట్‌ యూజర్‌’లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇతరుల బిల్లులు సైతం గెస్ట్‌ యూజర్‌లో చెల్లించొచ్చు. కరెంట్‌ అంతరాయాలే కాదు.. సరఫరాకు సంబంధించి ఇతర ఫిర్యాదులు సైతం యాప్‌లో చేయవచ్చు. హోమ్‌ పేజీలోనే ‘రిపోర్ట్‌ అజ్‌’ అనే ప్రాంతంలోఫొటోలు, వీడియోలతో సహా అప్‌లోడ్‌ చేయవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని