ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యమే
close

తాజా వార్తలు

Updated : 04/02/2021 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యమే

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

నెల్లూరు: నాయకత్వ బాధ్యతల కోసం పోటీపడటం శుభపరిణామమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు. అధిక సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఏకగ్రీవాలు శ్రుతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల వల్ల గ్రామాల్లో విఘాతాలు వస్తాయని తాము భావించడం లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారని నిమ్మగడ్డ అన్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో 85శాతం పోలింగ్‌ నమోదైందని, ఈసారి అంతకంటే ఎక్కువ నమోదయ్యే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

 

ఇవీ చదవండి...

రైతులు మా దేశ అంతర్భాగం : కోహ్లీ

దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని