close

తాజా వార్తలు

Published : 20/02/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆమె నా అదృష్టదేవత: స్టార్‌ సింగర్‌

మూడు సాంగ్స్‌ హిట్‌.. ట్వీట్‌ వైరల్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఓ నటి.. తనకు అదృష్ట దేవతతో సమానమని ప్రముఖ గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ తెలిపారు. బాలీవుడ్‌లో స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న అర్మాన్‌ గతేడాది విడుదలైన ‘బుట్టబొమ్మా’ పాటతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ‘గుచ్చే గులాబీ’ పాట ఆయనకు మరో హిట్‌ అందించింది.

కాగా, తాజాగా ఓ నెటిజన్‌.. ‘మీరు తెలుగులో అలపించిన అన్ని పాటల్లోకెల్లా ‘అరవింద సమేత’లోని ‘అనగనగనగా అరవిందట..’, ‘అల.. వైకుంఠపురములో’లోని.. ‘బుట్టబొమ్మా’ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోని.. ‘గుచ్చే గులాబీ’ పాటలు హిట్‌ అయ్యాయి. అయితే, ఆ మూడు పాటల్లోనూ పూజాహెగ్డే కథానాయికగా ఉన్నారు’ అని కామెంట్‌ చేశారు. దీనికి అర్మాన్‌ స్పందిస్తూ..‘ఆమె అదృష్టదేవత అనుకుంటా. అందుకే ఆమె సినిమాల కోసం పాడిన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఆయన పెట్టిన ట్వీట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరోయిన్‌ని ప్రశంసించడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ చిత్రాలకు ఎన్నో హిట్‌ పాటలు అందించిన అర్మాన్‌.. అక్కడ స్టార్‌ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. హిందీతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళీ బెంగాళీ, మరాఠీ పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అర్మాన్‌ 2014 నుంచి తెలుగు చిత్రాల్లో సైతం తన గాత్రాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 20 పాటలు పాడిన ఆయన 2018లో విడులైన ‘అరవింద సమేత’తో గాయకుడిగా తెలుగులో హిట్‌ అందుకున్నారు.
ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని