close

తాజా వార్తలు

Updated : 28/02/2021 11:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యువీ ట్వీట్‌లో తప్పేమీ కనపడలేదు 

స్పష్టం చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: మొతేరా పిచ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌లో తప్పేమీ లేదని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పష్టంచేశాడు. ఇటీవల జరిగిన డే/నైట్‌ టెస్టులో టీమ్‌ఇండియా రెండురోజుల్లోనే విజయం సాధించిన సందర్భంగా మాజీ ఆల్‌రౌండర్‌ ఆ పిచ్‌పై స్పందిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. ‘రెండు రోజుల్లోనే ఆట పూర్తి అయింది. ఇది టెస్టు క్రికెట్‌కు మంచిదో కాదో తెలియదు. ఒకవేళ ఇలాంటి పిచ్‌లపైనే అనిల్‌కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ చేస్తే టెస్టుల్లో వాళ్లు 1000, 800 వికెట్లు సాధించేవాళ్లు’ అని పేర్కొన్నాడు. కాగా, మరుసటి రోజే అశ్విన్‌ పలు అర్థంకాని ట్వీట్లు చేయడంతో అవి యువీని ఉద్దేశించే చేశాడని కొందరు నెటిజెన్లు పోస్టులు చేశారు.

ఈ నేపథ్యంలోనే శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అశ్విన్‌ తన ట్వీట్లపై స్పష్టతనిచ్చాడు. ‘నా ట్వీట్ల వెనుకున్న కారణం వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదు. నేను యువీ ట్వీట్‌ చూసినప్పుడు ఆశ్చర్యపోలేదు. అందులో మాకేదో చెబుతున్నాడని కూడా అనిపించలేదు. అది సాధారణ ట్వీట్‌లాగే కనిపించింది. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ ట్వీట్‌లో నాకు తప్పేమీ కనపడలేదు’ అని అశ్విన్‌ వివరణ ఇచ్చాడు. తనకు మాజీ ఆల్‌రౌండర్‌ చాలాకాలం నుంచి తెలుసని, అతడంటే ఎంతో గౌరవం ఉందని వివరించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 30 వికెట్లు పడగా అందులో 28 స్పిన్నర్లకే దక్కడం గమనార్హం. దీంతో ఈ పిచ్‌ తయారీపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇది టెస్టులకు పనికిరాదని, ఇలా చేయడం సరికాదని పలువురు మాజీ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విజయంతో టీమ్‌ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టి న్యూజిలాండ్‌ను కూడా ఓడించాలనే పట్టుదలతో భారత్‌ కనిపిస్తోంది. మరి కోహ్లీసేన తర్వాతి మ్యాచ్‌ను గెలుస్తుందా లేదా ఇంగ్లాండ్‌ గట్టి పోటీ ఇస్తుందా వేచిచూడాలి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని