ఉన్నవి 90ఓట్లు.. పోలైనవి 171
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉన్నవి 90ఓట్లు.. పోలైనవి 171

హాఫ్లాంగ్‌: అస్సాం శాసనసభ ఎన్నికల్లో అవకతవకలు మరోసారి బయటికొచ్చాయి. మొన్నటికి మొన్న ఓ భాజపా అభ్యర్థికి చెందిన కారులో ఈవీఎంను తరలిస్తుండటం రాజకీయ వివాదానికి తెరలేపగా.. తాజాగా ఓ పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవాటి కంటే దాదాపు రెట్టింపు ఓట్లు పోలవడం కలకలం రేపుతోంది. హసావో జిల్లాలోని హాఫ్లాంగ్‌ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

రెండో విడత ఎన్నికల్లో భాగంగా హాప్లాంగ్‌లో ఏప్రిల్‌ 1న పోలింగ్‌ జరిగింది. స్థానిక ఖోట్లిర్‌ ఎల్‌పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలోని ఓటర్ల జాబితాలో 90 మంది పేర్లు ఉండగా.. ఈవీఎంలో మాత్రం 171 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించిన ఐదుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు ఏప్రిల్‌ 2వ తేదీనే జారీ అయిన్పటికీ ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఘటన నేపథ్యంలో ఈ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈసీ ఓటర్ల జాబితాను అంగీకరించని స్థానిక గ్రామపెద్ద తమ సొంత జాబితాను తీసుకొచ్చారని, దాని ప్రకారమే అక్కడ ఓటింగ్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే జాబితా కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలిపారు. అయితే గ్రామపెద్ద తెచ్చిన జాబితాను పోలింగ్‌ సిబ్బంది ఎలా అనుమతించారన్నది ఇంకా తెలియరాలేదు. 

ఇటీవల కరీమ్‌గంజ్‌ జిల్లాలో ఓ పోలింగ్‌ కేంద్రానికి చెందిన ఈవీఎంను ప్రైవేటు వాహనంలో తరలిస్తుండటం, అది భాజపా అభ్యర్థికి చెందిన కారు కావడం తీవ్ర హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఘటన నేపథ్యంలో భాజపా, ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని