
తాజా వార్తలు
అచ్చెన్నాయుడి బెయిల్ తిరస్కరించిన అనిశా కోర్టు
అమరావతి: మాజీమంత్రి, తెదేపా ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌ను అనిశా న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. ఈఎస్ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో ఆయన రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కొలనోస్కోపి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు కాబట్టి తనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. లేదంటే జైల్లోకి అనుమతించరని పేర్కొన్నారు. కాగా ఆరోగ్య కుదుటపడనప్పటికీ అచ్చెన్నను అక్రమంగా డిశ్చార్జి చేశారని తెదేపా వర్గాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆయన డిశ్చార్జిని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సైతం ఖండించారు.
Tags :