N440K: తీవ్రత లేకుంటే ఏపీపై ఆంక్షలెందుకు?
close

తాజా వార్తలు

Updated : 07/05/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

N440K: తీవ్రత లేకుంటే ఏపీపై ఆంక్షలెందుకు?

ప్రభుత్వాన్ని నిలదీసిన అచ్చెన్నాయుడు 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం N440K అనే కొత్త రకం కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి తీవ్రత లేకపోతే పొరుగు రాష్ట్రాలు ఏపీ నుంచి వచ్చేవారిపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నాయని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఏపీ నుంచి వచ్చేవారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ సహా వివిధ రాష్ట్రాలు ఆంక్షలు పెట్టాయన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. ప్రజల ప్రాణాల కంటే జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఇకనైనా తప్పిదాలు కప్పిపెట్టకుండా ప్రతిపక్షాలు, శాస్త్రవేత్తలు, న్యాయస్థానాలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని హితవుపలికారు. 18-45 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలనే కేంద్ర మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు.

ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలి: మంతెన

రాష్ట్రంలో కరోనా నియంత్రణపై వైకాపా నేతలు వాస్తవాలు దాచి.. దేశంలోనే ఏపీ మొదటి స్థానమంటూ డబ్బాకొట్టుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ధ్వజమెత్తారు. ప్రజలు వాయువు లేక ఆయువు కోల్పోయే దుస్థితి ఏపీలో ఉండటం జగన్‌ చేతకాని తనమేనన్నారు. రాష్ట్రంలో వైద్యం అందక పొరుగు రాష్ట్రాలకు ప్రజలు తరలిపోతుంటే ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు గుంజుతున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు పట్టించుకోని జగన్‌ రెడ్డి కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసే పనిలో బిజీగా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్ని తీవ్ర పరిణామాల దృష్ట్యా వెంటనే ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలని మంతెన డిమాండ్‌ చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని