క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ తెదేపా: అచ్చెన్న
close

తాజా వార్తలు

Published : 29/03/2021 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ తెదేపా: అచ్చెన్న

తిరుపతి: క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపాకు భవిష్యత్తు లేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసి పుచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తెదేపాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

‘‘తెదేపా ఏనాడు ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టలేదు. కక్ష సాధింపులు తెదేపాను ఏం చేయలేవు. రెండేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల పాలైంది. అభివృద్ధి కంటే ప్రచారం కోసమే ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇసుకపై రూ.5 వేల కోట్ల దోపిడీకి తెరలేపింది. తిరుపతి పవిత్రతను కాపాడాలంటే ఉప ఎన్నికలో వైకాపాను ఓడించాలి. అధికార పార్టీ వాలంటీర్లతో భయపెట్టి ఓట్లు వేయించుకుంటోంది. ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయకుంటే పథకాలు ఆపుతామని వాలంటీర్లు బెదిరిస్తే రికార్డు చేయండి. రికార్డు చేసి పంపిస్తే రూ.10 వేలు పారితోషికం ఇస్తాం.’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని