తెదేపా నేత పట్టాభిపై దాడి
close

తాజా వార్తలు

Updated : 02/02/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెదేపా నేత పట్టాభిపై దాడి

విజయవాడ : తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపై విజయవాడలో దాడి జరిగింది. ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరుతుండగా పట్టాభి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పట్టాభికి గాయాలయ్యాయి. ఆయన సెల్‌ఫోన్‌ ధ్వంసమైంది. సుమారు 10 మంది దుండగులు ఈ దాడిలో పాల్గొన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

రాడ్‌లతో వచ్చి నాపై దాడి చేశారు..

ఈ ఘటన అనంతరం పట్టాభి దాడి జరిగిన తీరు గురించి వివరించారు. ‘దుండగులు రాడ్‌లతో దాడికి పాల్పడ్డారు. నాపై విచక్షణారహితంగా దాడికి దిగారు. నాతోపాటు డ్రైవర్‌ను కూడా గాయపరిచారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే దాడులు చేస్తున్నారు. అయినా పోరాడుతూనే ఉంటా. ఈ ఘటనపై డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలి. ఆరు నెలల క్రితం కూడా నా కారుపై దాడి జరిగింది. ఆ ఘటనపై ఇప్పటి వరకూ చర్యల్లేవు’ అని పట్టాభి అన్నారు.

పట్టాభిపై దాడి జరగటం ఇది రెండోసారి. గతంలో కూడా ఆయన వాహనంపై దుండగులు దాడి చేశారు. తనపై జగన్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దాడికి యత్నిస్తోందని ఆయన గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

ఘటనాస్థలికి చంద్రబాబు..

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురునానక్‌ నగర్‌లోని పట్టాభి ఇంటికి వెళ్లారు. దుండగుల దాడిలో గాయపడ్డ పట్టాభిని పరామర్శించారు. దాడి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి..
అచ్చెన్నాయుడు అరెస్టు

అచ్చెన్న అరెస్టు జగన్‌ కక్ష సాధింపునకు పరాకాష్ఠ

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని