మహిళపై పెట్రోల్‌తో ఉన్మాది దాడి
close

తాజా వార్తలు

Updated : 05/01/2021 16:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళపై పెట్రోల్‌తో ఉన్మాది దాడి

ఆచంట: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని భీమలాపురం గ్రామంలో మహిళపై ఉన్మాది పెట్రోల్‌తో దాడి చేయడం కలకలం సృష్టించింది. ఆచంటకు చెందిన నెక్కంటి నరేశ్‌  భీమలాపురంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మంగళవారం ఉదయం సదరు మహిళ ఇంటికెళ్లి ఆమె ముఖంపై పెట్రోల్‌పోసి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ భర్త, తల్లి, సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ఉన్మాది చేతులకు కూడా గాయాలు కావడంతో అతన్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..
సింగరాయకొండలో మూడు విగ్రహాలు ధ్వంసం

రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్‌Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని