నార్సింగిలో యువతిపై ప్రేమోన్మాది దాడి
close

తాజా వార్తలు

Published : 03/03/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నార్సింగిలో యువతిపై ప్రేమోన్మాది దాడి

రంగారెడ్డి: నార్సింగి పరిధిలోని హైదర్‌షాకోట్‌ లక్ష్మీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో లంగర్‌హౌస్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. హైదర్‌షాకోట్‌లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న షారుఖ్‌సల్మాన్‌ అనే యువకుడు ఈ ఉన్మాదానికి తెగబడ్డట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సదరు యువతితో పరిచయం పెంచుకున్న షారుఖ్‌ ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన షారుఖ్‌ ఆమెపై కూరగాయలు తరిగే కత్తితో దాడిచేశాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌ను నిందితుడు షారుఖ్‌ కత్తితో బెదిరించి పరారయ్యాడు. దీంతో స్థానికులు నిందితుడిని వెంబడించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెపై షారుఖ్‌ వేధిస్తున్నాడంటూ యువతి తండ్రి గతంలో షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బాధిత యువతి గచ్చిబౌలిలో ఓ ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తోంది. మరోవైపు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న బాధిత యువతిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించారు. 

బాధితురాలికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. యువతితో షారుఖ్‌సల్మాన్‌కు రెండు సంవత్సరాల నుంచి పరిచయం ఉందని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఘటనలో బాధితురాలి తల్లికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని