చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు యత్నం
close

తాజా వార్తలు

Updated : 01/03/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు యత్నం

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించి నిరసన కొనసాగిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబును హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ మేరకు వారు టికెట్‌ రిజర్వ్‌ చేసినట్లు సమాచారం. మధ్యాహ్నం 3.10 గంటలకు స్పైస్‌జెట్‌లో పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబుతో అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనక నర్సారెడ్డి చర్చిస్తున్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుంటున్న తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఈ ఉదయం చిత్తూరు జిల్లా పర్యటన కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబును పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన అక్కడే నిరసన కొనసాగిస్తున్నారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని