IPL: హమ్మయ్య.. ఇంటికి చేరుకున్నాం!
close

తాజా వార్తలు

Published : 31/05/2021 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: హమ్మయ్య.. ఇంటికి చేరుకున్నాం!

ఆస్ట్రేలియా క్రికెటర్ల సంబరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు! కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌ తమ భార్యా బిడ్డలు, తల్లిదండ్రులను కలిసి ఊరట పొందారు. ఈ విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

కరోనా వైరస్‌ కేసులు బయటపడటంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మిగతా విదేశీ క్రికెటర్లు మూడు రోజుల్లోనే తమ దేశాలకు చేరుకున్నారు. ఆసీస్‌ నుంచి వచ్చిన క్రికెటర్లు, సహాయ సిబ్బంది, వ్యాఖ్యాతల బృందానికి మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ దేశం పెట్టిన కఠిన ఆంక్షలే ఇందుకు కారణం. నేరుగా భారత్‌ నుంచి ప్రయాణాలను నిషేధించింది. ఇతర దేశాల్లో పది రోజులకు పైగా ఉండి రావాలంది. దాంతో వారు మాల్దీవుల్లో 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆసీస్‌ వెళ్లి  14 రోజులు సిడ్నీలో క్వారంటైన్‌లో ఉంది. ఆదివారంతో గడువు పూర్తవ్వడంతో ఆటగాళ్లు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

‘ఇంటికి చేరుకోవడం గొప్పగా అనిపిస్తోంది’ అని డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నాడు. ముగ్గురు పిల్లలతో కలిసిన చిత్రాలను పోస్ట్‌ చేశాడు. ‘కొత్త గాలి పీల్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అని పేసర్‌ జేసన్‌ బెరెన్‌డార్ఫ్‌ ఏబీసీ వార్తా సంస్థకు చెప్పాడు. ‘ఎక్కడో ఒక చోట ఇరుక్కుపోవడం కఠినంగా ఉంటుంది. ఇంటికి వెళ్తామని తెలియడం మాత్రం ఉపశమనం. ఇప్పుడు మా క్వారంటైన్ ముగిసింది. ఇంటికెళ్లి కుటుంబీకులను చూసేందుకు ఆగలేకపోతున్నా’ అని తెలిపాడు. ఇక ఐపీఎల్‌ రెండో దశ సెప్టెంబర్లో యూఏఈలో జరుగుతుందన్న సంగతి తెలిసిందే. బహుశా ఆసీస్‌ క్రికెటర్లు ఎక్కువ మంది అక్కడికి రాకపోవచ్చని సమాచారం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని