‘అవతార్‌2’ కోసం నటి సాహసం
close

తాజా వార్తలు

Published : 29/10/2020 13:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అవతార్‌2’ కోసం నటి సాహసం

ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దృశ్య కావ్యాల్లో ‘అవతార్‌’ సిరీస్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సామ్‌ వర్తింగ్‌స్టన్, క్లిఫ్‌ కర్టిస్, కేట్‌ విన్‌స్లెట్, బ్రెన్‌ డన్‌ కవెల్‌ వంటి స్టార్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ‘అవతార్‌ 2’ చిత్రీకరణ పూర్తికాగా.. ‘అవతార్‌ 3’ సైతం 95శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. తొలి భాగం పండోరా గ్రహం నేపథ్యంలో సాగగా.. ఇప్పుడు రానున్న రెండో భాగం సముద్ర గర్భం నేపథ్యంలో ఉండనుంది.

ఇందుకోసమే నీటి అడుగు భాగంలో కూడా కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం నటి కేట్‌ విన్‌స్లెట్‌ ఓ పెద్ద సాహసం చేసింది. ఒక సీన్‌ చిత్రీకరణ కోసం ఆమె నీటి అడుగున దాదాపు 7నిమిషాల పాటు ఊపిరి బిగపట్టి ఉందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె   సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టింది.

‘‘అవతార్‌’లో నా పాత్రను పోషించడానికి నీళ్లలో ఫ్రీ డైవ్‌ ఎలా చేయాలో నేర్చుకున్నా. నమ్మశక్యం కాని మరో విషయం ఏంటంటే.. ఓ సీన్‌ కోసం నీటి అడుగున 7నిమిషాల 14సెకన్ల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నా’’ అని చెప్పుకొచ్చింది  కేట్‌ విన్‌స్లెట్‌. దీంతో పాటు నీటు అడుగున   చిత్రీకరణలో ఉన్న తన చిత్రాన్ని ఒకటి    అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని