close

తాజా వార్తలు

Updated : 18/01/2021 14:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌

హైదరాబాద్‌: నగరంలో కలకలం సృష్టించిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ మరోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. అపహరించిన కేసులో ఈ నెల 6న బోయిన్‌పల్లి పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

దర్యాప్తులో పురోగతి కోసం ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించారు. కస్టడీ ముగిసినందున బెయిల్‌ ఇవ్వాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని.. పోలీసుల కస్టడీ పూర్తి అయినందున బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌లో అఖిలప్రియ పేర్కొన్నారు.

పోలీసులు మాత్రం అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు  చేశారు. అపహరణ కేసులో ఇతర నిందితులైన భార్గవ్‌రామ్‌, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శ్రీను మరికొంతమంది పరారీలో ఉన్నారని పోలీసులు కౌంటర్‌ పిటిషన్‌లో వెల్లడించారు. అఖిలప్రియకు బెయిల్‌ మంజూరు చేస్తే ఇతర నిందితులు దొరికే అవకాశం లేదన్నారు.

ఇదీ చదవండి..
రూ.10 లక్షలకు కిడ్నాప్‌ ఒప్పందం



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని