బజాజ్‌ హెల్త్‌కేర్‌ నుంచి ఫావిపిరవిర్‌
close

తాజా వార్తలు

Published : 04/05/2021 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బజాజ్‌ హెల్త్‌కేర్‌ నుంచి ఫావిపిరవిర్‌

ముంబయి: కరోనా సెకండ్‌ వేవ్‌లో కొవిడ్‌ రోగుల చికిత్సకు ఔషధ కొరత ఏర్పడింది. ఈ తరుణంలో ఔషధాల ఉత్పత్తిని పెంచేందుకు పలు సంస్థలకు అత్యవసర అనుమతులు లభిస్తున్నాయి. తాజాగా బజాజ్‌ హెల్త్‌కేర్‌ ఫార్మా సంస్థ ఫావిపిరవిర్‌ తయారీ, మార్కెటింగ్‌ చేసుకునేందుకు భారత డ్రగ్‌ రెగ్యులేటరీ అమెదం తెలిపింది. దీంతో బజాజ్‌ హెల్త్‌కేర్‌ ఫార్మా ఫావిజాజ్‌ బ్రాండ్‌ పేరుతో మాత్రల రూపంలో ఫావిపిరవిర్‌ను తయారుచేయనుంది.  

ఔషధ కొరత ఏర్పడిన సమయంలో ఫావిపిరవిర్‌ను తయారు చేసేందుకు అనుమతులు లభించడంతో బజాజ్‌ హెల్త్‌కేర్‌ సంస్థ సంతోషం వ్యక్తం చేసింది. ఫావిపిరవిర్‌ యాక్టివ్‌ ఫార్మాస్యూటిక్‌ ఇంగ్రీడియంట్‌, ఫార్ములాను అర్‌ అండ్‌ డి విభాగం అభివృద్ధి చేస్తోందని సంస్థ తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌కు ఫావిజాజ్‌ను సరఫరా చేసేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చినట్టు పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో కరోనా రోగులకు సమర్థవంతమైన ఫావిజాజ్‌ను వంటి ఔషధాన్ని అందించడంవల్ల ఔషధ కొరత అధిగమించొచ్చని బజాజ్‌ హెల్త్‌కేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ అనిల్‌ జైన్‌ తెలిపారు.  

ఇన్‌ఫ్లూయాంజా చికిత్సకు వాడే ఫావిపిరవిర్‌ కొవిడ్‌ రోగులపై సమర్థవంతంగా పనిచేసిందని పరిశోధనల్లో తేలింది. దాంతో కొవిడ్‌ చికిత్సలో ఫావిపిరవిర్‌ వాడేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియా అమోదించింది. వివిధ మోతాదుల్లో బజాజ్‌ హెల్త్‌కేర్‌ తయారు చేస్తున్న ఫావిజాజ్‌ (ఫావిపిరవిర్‌)ను స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్‌ రోగులకు అందించనున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని