ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్‌

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. పోరాట సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులన్నీ డిపోలకే పరిమితం కానున్నాయి.

 

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండిTags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని