close

తాజా వార్తలు

Updated : 27/11/2020 15:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుల సంఘాలను కేసీఆర్‌ మోసం చేశారు: బండి

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐఎస్‌ సదన్‌లో ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కుల సంఘాల భవనాలు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 

ఇప్పటి వరకు ఎన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలప్పుడు మాత్రమే కేసీఆర్‌కు కుల సంఘాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కులాల పేరుతో, వర్గాలతో చీల్చే ప్రయత్నం చేయకుండా అందరూ ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. భాజపాను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ తెస్తారని విమర్శించారు. తెరాస పోవాలంటే భాజపాకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు.. చేశారా? అని ప్రశ్నించారు. పేదలు వర్షాలకు తడుస్తుంటే.. సీఎం కేసీఆర్‌ రూ.100  కోట్లతో ప్రగతిభవన్‌ కట్టుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేశారని విమర్శించారు. ఈనెల 28న కేసీఆర్‌ చెప్పే పిట్టకథలు నమ్మితే మరోసారి మోసపోతారని ఓటర్లకు సూచించారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన